మార్చి 8 నుంచి రామ్ కొత్త సినిమా

Monday,February 26,2018 - 03:21 by Z_CLU

ఎనర్జిటిక్ స్టార్ రామ్ కొత్త సినిమా మార్చి 8 నుంచి ప్రారంభంకానుంది. తన అఫీషియల్ ట్విట్టర్ ఎకౌంట్ లో ఈ విషయాన్ని ప్రకటించాడు రామ్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రానున్న ఈ సినిమాకు చాన్నాళ్ల కిందటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రామ్. తాజాగా ప్రీ-ప్రొడక్షన్ పూర్తవ్వడంతో సెట్స్ పైకొచ్చే డేట్ ఫిక్స్ చేశాడు.

ఉన్నది ఒకటే జిందగీ తర్వాత రామ్ నుంచి రాబోతున్న సినిమా ఇదే. ఆ మూవీలో తన సరసన నటించిన అనుపమ పరమేశ్వరన్ నే కొత్త సినిమాలో కూడా హీరోయిన్ గా తీసుకున్నాడు. దిల్ రాజు కు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది.

సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు. గతంలో నేను లోకల్ లాంటి సూపర్ హిట్ సినిమా అందించాడు త్రినాధరావు.