విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంభం

Friday,April 21,2017 - 10:00 by Z_CLU

విజయ్ దేవరకొండ హీరోగా గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై కొత్త సినిమా ప్రారంభమైంది. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ఈ రోజు పూజాకార్యక్రమాలు జరిగాయి. చిన్న సినిమాలు తీయాలనే ఉద్దేశంతో గీతాఆర్ట్స్-2 పిక్చర్స్ బ్యానర్ పెట్టిన విషయం తెలిసిందే. బన్నీవాస్ నిర్మాణంలో ఈ కొత్త సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది.

శ్రీరస్తు శుభమస్తు సినిమాతో మరోసారి లైమ్ లైట్లోకి వచ్చాడు పరుశురాం. అటు విజయ్ దేవరకొండ కూడా పెళ్లిచూపులు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. వీళ్లిద్దరూ కలిసి ఇప్పుడు గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ కొత్త సినిమా రాబోతోంది.

 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ద్వారక సినిమాను ఇప్పటికే విడుదల చేసిన ఈ హీరో.. త్వరలోనే అర్జున్ రెడ్డి సినిమాను థియేటర్లలోకి తీసుకురాాబోతున్నాడు. ఈ మూవీతో పాటు రాహుల్, భరత్, నందినిరెడ్డి, క్రాంతి మాధవ్ సినిమాలు లైన్లో ఉన్నాయి.