వయసు జస్ట్ నంబర్ మాత్రమే

Friday,April 21,2017 - 12:33 by Z_CLU

ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ వయసు 43. కానీ తనకు మాత్రం పెరుగుతున్న వయసు జస్ట్ నంబర్ మాత్రమే. మొన్నటికి మొన్న రణబీర్ కపూర్ సరసన ‘అయ్ దిల్ హై ముష్కిల్’ సినిమాలో సిల్వర్ స్క్రీన్ పై సెగలు పుట్టించిన ఐష్, రీసెంట్ గా జరిగిన ఫిలిం ఫేర్ మ్యాగజైన్ కోసం చేసిన ఫోటో షూట్ లో స్టన్నింగ్ గ్లామర్ తో షాకిచ్చేసింది.

ఆఫ్ షోల్డర్ నేవీ బ్లూ కలర్ జాకెట్ లో హాట్ & గ్రేస్ ఫుల్ గా కనిపిస్తున్న ఐశ్వర్యా, ఇప్పుడు సోషల్ మీడియాలో మోస్ట్ డిజైర్ ట్రెండింగ్ ఎలిమెంట్. మిస్ వరల్డ్ టైటిల్ ని సొంతం చేసుకుని 23 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ అదే గ్రేస్ ని మెయిన్ టైన్ చేస్తున్న ఐశ్వర్యారాయ్ బచ్చన్, నేటి తరం హీరోయిన్ కి గట్టి పోటీ ఇచ్చే విషయంలో ఏ మాత్రం చాన్స్ తీసుకోవడం లేదు.

పదేళ్ళ క్రితం అభిషేక్ బచ్చన్ ని పెళ్ళాడిన ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఏప్రిల్ 19 న 10th వెడ్డింగ్ ఆనివర్సరీని సెలెబ్రేట్ చేసుకుంది. ఒక పాపకు తల్లైన ఐశ్వర్య ఇక గ్లామర్ క్యారెక్టర్స్ కు బై బై చెప్పడం గ్యారంటీ అని ఫిక్సయిన టైం లో, రోజులు గడుస్తున్న కొద్దీ మెరుగుపడుతున్న అందంతో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తూనే ఉంది ఐశ్వర్య.