విజయ్ సేతుపతి మెచ్చిన ''A''

Monday,February 01,2021 - 01:45 by Z_CLU

చిన్న సినిమాగా వస్తున్న A Movie పెద్ద హీరోల్ని సైతం ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నచ్చి రిలీజ్ చేసేందుకు PVR సంస్థ ముందుకొచ్చింది. ఇప్పుడు మరో నటుడ్ని ఈ సినిమా ఎట్రాక్ట్ చేసింది.

విలక్షణ నటుడు విజయ్ సేతుపతికి “A” మూవీ ట్రయిలర్ నచ్చింది. ఇది అతడికి ఎంతలా నచ్చిందంటే.. స్వయంగా మూవీని ప్రమోట్ చేయడానికి ముందుకొచ్చాడు ఈ నటుడు. ఇందులో భాగంగా 5వ తేదీన “A” మూవీ ట్రయిలర్ ను విజయ్ సేతుపతి రిలీజ్ చేయబోతున్నాడు.

థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కింది “A” సినిమా. ఇప్పటివరకు ఇలాంటి కథ టాలీవుడ్ స్క్రీన్ పై రాలేదంటున్నాడు దర్శకుడు యుగంధర్. ఆ కొత్త పాయింటే విజయ్ సేతుపతి లాంటి నటుడికి కూడా నచ్చిందని చెబుతున్నాడు.

నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని హీరోహీరోయిన్లుగా నటించిన ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ఈనెల 26న థియేటర్లలోకి రానుంది.

A movie ad infinitum