Vikram తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసిన చరణ్

Friday,May 20,2022 - 06:07 by Z_CLU

‘Vikram’ Telugu trailer released by Ram Charan

కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫహద్ ఫాసిల్ కాంబినేషన్ లో లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ప్యాక్డ్ ‘విక్రమ్’ జూన్ 3 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసి టీం కి విషెస్ తెలిపాడు.

2 నిమిషాల 35 సెకన్ల తో కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంది. “అడవి అన్నాక సింహం , పులి , చిరుత అన్నీ వేటకి వెళ్తాయ్…జింక తపించుకోవాలని చూస్తుంది. ఆ లోపు సూర్యాస్తమయం అయితే సూర్యోదయాన్ని చూసేది ఎవరనేది ప్రకృతి నిర్ణయిస్తుంది. కానీ ఈ అడవిలో వెలుగు ఎప్పుడూ ఎక్కడ అనేది నిర్ణయించేది ప్రకృతి కాదు..నేను” అంటూ కమల్ హాసన్ వాయిస్ ఓవర్ తో ఇంట్రెస్టింగ్ విజువల్స్ తో స్టార్టయిన ట్రైలర్ యాక్షన్ ఎపిసోడ్స్ గ్లిమ్స్ తో ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేసింది.

ముఖ్యంగా మూడు కేరెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయో ట్రైలర్ చూపించి కథ మీద ఆసక్తి కలిగించేలా చేశాడు దర్శకుడు.  గిరీష్ గంగాధరన్ విజువల్స్ , అనిరుద్ స్కోర్ తో పాటు అన్బరివ్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ క్లిప్స్, కమల్ డైలాగ్స్ ట్రైలర్ లో హైలైట్స్ గా నిలిచాయి.  ఓవరాల్ గా ట్రైలర్ మూవీ లవర్స్ ని ఎట్రాక్ట్ చేసి సినిమా చూడాలనే క్యూరియాసిటీ కలిగిస్తుంది. శ్రేష్ట్ మూవీస్ పై నితిన్ తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు.

 * Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics