Balakrishna-Boyapati - టైటిల్ కంటే ముందు రిలీజ్ డేట్

Monday,February 01,2021 - 01:40 by Z_CLU

Balakrishna Boyapati movie on May 28
బాలకృష్ణ-బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. కానీ రిలీజ్ డేట్ మాత్రం ఎనౌన్స్ చేశారు. సమ్మర్ ఎట్రాక్షన్ గా మే 28న థియేటర్లలోకి రానుంది బాలయ్య కొత్త సినిమా.

హీరోలంతా తమ కొత్త సినిమాల రిలీడ్ డేట్స్ ను వరుసగా ఎనౌన్స్ చేస్తున్నారు. దీంతో బాలయ్య కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మందుగానే డేట్ లాక్ చేశాడు. త్వరలోనే టైటిల్ ను ప్రకటించబోతున్నాడు.

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

balakrishna boyapati movie may 28 release zeecinemalu