Chaavu Kaburu Challaga - రిలీజ్ డేట్ వచ్చేసింది

Monday,February 01,2021 - 01:49 by Z_CLU

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ‌బన్నీ వాసు నిర్మాత‌గా ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’. ‌ఇప్పటికే విడుదలైన టైటిల్.. హీరో కార్తికేయ ‘బ‌స్తి బాల‌రాజు’ ఫ‌స్ట్ లుక్, ఇంట్రో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది,

ఆ త‌రువాత విడుద‌లైన క్యారెక్ట‌ర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి, టీజ‌ర్ గ్లిమ్ప్స్ కి కూడా అనూహ్య స్పంద‌న ల‌భించింది. ముఖ్యంగా కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రి మాడ్యూలేష‌న్ చూస్తే మ‌ళ్లీ చూడాల‌నిపించేలా ఉందంటూ కామెంట్స్ వ‌స్తున్నాయి. ఇదే ఊపులో.. మార్చి 19న చావుక‌బురు చ‌ల్ల‌గా చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నట్లుగా నిర్మాత బ‌న్నీవాసు ఎనౌన్స్ చేశాడు.

ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగళ్ల‌పాటి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే రీతిన ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నార‌నే విష‌యం ఇటీవ‌లే విడుద‌లైన బ‌స్తీబాల‌రాజు క్యారెక్ట‌ర్ వీడియో ద్వారా అలానే తాజాగా వ‌చ్చిన టీజ‌ర్ గ్లింప్స్ ద్వారా స్ప‌ష్టం అవుతుంది.

Chaavu Kaburu Challaga March 19 release zeecinemalu karthikeya lavanya tripathi

జిఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో “100% ల‌వ్”, “భ‌లేభ‌లే మ‌గాడివోయ్‌”, ” గీతగోవిందం”, “ప్ర‌తిరోజు పండ‌గే” చిత్రాలు ఘ‌న‌ విజాయాలు సాధించాయి. ఆ లెగ‌సినీ స‌క్సెస్ ఫుల్ గా చావుక‌బురుచ‌ల్ల‌గా ముందుకు తీసుకువెళుతుంద‌నే న‌మ్మ‌కంతో యూనిట్ ఉంది.