అఫీషియల్ : విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ !

Thursday,February 20,2020 - 10:52 by Z_CLU

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రెజెంట్ బాక్సింగ్ తో కూడిన యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు మరికొన్ని సీన్స్  తీస్తున్నారు. తాజాగా  సినిమాలో విజయ్ సరసన నటిస్తున్న హీరోయిన్ ఎవరనేది అఫీషియల్ అనౌన్స్ చేసారు.

అవును మొన్నటి వరకూ ఈ సినిమాలో హీరోయిన్ అంటూ వినిపించిన అనన్య పాండే నే ఫైనల్ చేసారు. షూటింగ్ స్పాట్ నుండి అనన్య కి వెల్కం చెప్తూ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు పూరి. సినిమా ఏ జోనర్ అయినా తన దైన శైలిలో హీరో -హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్స్ రాసుకుంటాడు పూరి. ఈ సినిమాలో కూడా విజయ్ -అనన్య మధ్య యువతను ఎట్రాక్ట్ చేసే రొమాంటిక్ సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కరణ్ జోహార్ , చార్మీ , అపూర్వ మెహత సంయుక్తంగా నిర్మిస్తున్నారు.