'లవ్ స్టోరి' షూటింగ్ అప్ డేట్స్ !

Thursday,February 20,2020 - 03:05 by Z_CLU

నాగ చైతన్య , సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ‘లవ్ స్టోరి’ సినిమా షూటింగ్ ఫినిషింగ్ స్టేజికి చేరుకుంది. ఇటివలే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీసిన యూనిట్ నెక్స్ట్ షెడ్యుల్ కోసం దుబాయ్ వెళ్ళారు.

దుబాయ్ లో ఓ వారం పాటు జరగనున్న షెడ్యుల్ తో టోటల్ షూటింగ్ కి ప్యాకప్ చెప్పనున్నారని సమాచారం. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానుంది.