'అంధాదున్' రీమేక్ కి డైరెక్టర్ ఫిక్స్ !

Thursday,February 20,2020 - 10:02 by Z_CLU

ఇటివలే బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘అంధాదున్‘ కి సంబంధించి తెలుగు రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న నితిన్ త్వరలోనే సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమాను మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ విషయాన్నీ నితిన్ అధికారికంగా ప్రకటించాడు.

శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సొంత ప్రొడక్షన్ లో ఈ రీమేక్ సినిమాను చేయబోతున్నాడు నితిన్. సమ్మర్ నుండి షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాకు సంబంధించి రెండు, మూడు షెడ్యుల్స్ లో టోటల్ షూట్ కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమాలో టబు రోల్ ఎవరు చేస్తారు నితిన్ సరసన హీరోయిన్ ఎవరనేది తెలియాల్సి ఉంది.