విజయ్ దేవరకొండ – ఒక్క రష్మిక విషయంలోనే

Friday,July 26,2019 - 11:30 by Z_CLU

ఎనిమిది సినిమాల కరియర్ లో ఇప్పటి వరకు ఒక్క హీరోయిన్ ని కూడా రిపీట్ చేయలేదు విజయ్ దేవరకొండ ఒక్క రష్మికని తప్ప. ‘డియర్ కామ్రేడ్’ తో కలిపి వీళ్ళిద్దరూ జతగా కలిసి చేసింది 2 సినిమాలే అయినా, ఆడియెన్స్ లో మాత్రం వీళ్ళిద్దరినీ ఎన్నిసార్లు స్క్రీన్ పై చూసినా, క్రేజ్ మాత్రం ఒకింత కూడా తగ్గేలా కనిపించడం లేదు.

విజయ్ దేవరకొండకి ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ, రష్మిక, విజయ్ దేవరకొండ జత కట్టారంటే సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉండగానే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి.

 ‘గీత గోవిందం’ తో మొదలైన ఈ జోడీ క్రేజ్ ‘డియర్ కామ్రేడ్’ పై భారీ అంచనాలు పెంచేసింది. దానికి తగ్గట్టే సినిమా కూడా అదే స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటుంది. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ‘డియర్ కామ్రేడ్’ తరవాత ఇప్పట్లో మళ్ళీ కలిసి నటించే ఉద్దేశం లేదన్నట్టుగా చెప్పుకుంది రష్మిక.

అయితే ఒకటి మాత్రం నిజం. ఇప్పటి వరకు విజయ దేవరకొండ సరసన నటించిన ఏ హీరోయిన్ కి ఆడియెన్స్ ఇంతగా కనెక్ట్ అవ్వలేదు. ఒక్క రష్మిక తో తప్ప…