ఆర్-ఆర్-ఆర్ మూవీ అప్ డేట్స్

Friday,July 26,2019 - 01:38 by Z_CLU

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఆర్-ఆర్-ఆర్ సినిమాకు సంబంధించి ఓ భారీ షెడ్యూల్ రెడీ అవుతోంది. వచ్చే నెలలో ఈ సినిమాకు సంబంధించి ఏకంగా 35 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు. సినిమా సెట్స్ పైకి వచ్చిన తర్వాత ఫిక్స్ చేసిన భారీ షెడ్యూల్ ఇదే.

నిజానికి ఈ సినిమా కోసం పూణెలో ఇలాంటిదే 30 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు. కానీ ఆ షెడ్యూల్ టైమ్ లో రామ్ చరణ్ గాయపడ్డంతో అది కాస్తా రద్దయింది. మళ్లీ ఇన్నాళ్లకు తమిళనాట 35 రోజుల లాంగ్ షెడ్యూల్ ఫిక్స్ చేశారు.

అయితే ఈ షెడ్యూల్ లో ఎక్కువ కాల్షీట్లు ఎన్టీఆర్ కే ఉన్నాయి. 35 రోజుల షెడ్యూల్ లో దాదాపు 23 రోజులు యంగ్ టైగర్ పైనే షూటింగ్ ఉంటుంది. మిగతా రోజులు ఎన్టీఆర్-రామ్ చరణ్ కలిసి వర్క్ చేస్తారు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత. ఓ హీరోయిన్ గా అలియాభట్ ఫిక్స్ అయింది. మరో హీరోయిన్ గా ఓ విదేశీ భామను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. కీరవాణి ఈ సినిమాకు సంగీత దర్శకుడు.