‘మన్మధుడు 2’ లో తెలియాల్సిందదే

Friday,July 26,2019 - 11:03 by Z_CLU

‘మన్మధుడు 2’ లో నాగార్జున క్యారెక్టర్ ఎలా ఉండబోతున్నది ఇప్పటికే అందరికీ అర్థమయిపోయింది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ నాగ్ ని పక్కా ప్లే బాయ్ లా ప్రెజెంట్ చేయబోతున్నాడు. ఇక రకుల్ రోల్ గురించి క్యారెక్టర్ టీజర్ లోనే ఆల్మోస్ట్ అర్థమైపోయింది. అయితే ఈ సినిమాలో ఏ మాత్రం రివీల్ చేయకుండా సస్పెన్స్ లో ఉన్న ఎలిమెంట్ ఒక్కటే అదే తెలియాల్సి ఉంది.

సినిమాలో కీర్తి సురేష్ కామియో రోల్ ప్లే చేస్తుంది. మరి ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది..? ఇక సమంతా సంగతి కూడా ఎక్కడా బయటపెట్టట్లేదు. ఈ 2 క్యారెక్టర్స్ కి సంబంధించి తెలిసిందేమైనా ఉంటే వీళ్ళిద్దరూ కనిపించబోయేది  వెరీ ఇంపార్టెంట్ స్పేస్ లో… అది కూడా ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్సెన్స్ లో…

‘మన్మధుడు 2’ లో ఎమోషనల్ జోన్ కూడా ఉండబోతుంది. అది ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్సెస్ కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టే, మేకర్స్ ఎక్కడా ఆ సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ రివీల్ అవ్వకుండా, సినిమాలోని ఫన్ సైడ్ నే ఎక్కువగా ఎలివేట్ చేస్తున్నారు.