Exclusive: ‘హీరో’ టైటిల్ తో విజయ్ దేవరకొండ

Wednesday,December 12,2018 - 04:14 by Z_CLU

ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ‘డియర్ కామ్రేడ్’ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. అయితే ఈ సినిమాతో పాటు ఇదే బ్యానర్ లో ఇంకో సినిమా కూడా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమాకి ‘హీరో’ అనే టైటిల్ ఫిక్సయ్యారు మేకర్స్. విజయ్ దేవరకొండ మ్యానరిజం కి ఆప్ట్ అనిపిస్తుంది ఈ టైటిల్.

ఈ సినిమా డైరెక్టర్ ఎవరా అన్నది ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది. జనవరి నుండి ఈ సినిమా ఆర్ట్ వర్క్ బిగిన్ చేయనున్న మేకర్స్, ఆల్మోస్ట్ స్క్రిప్ట్ వర్క్ కి ప్యాకప్ చెప్పినట్టు తెలుస్తుంది. ‘పెళ్ళి చూపులు’ దగ్గరి నుండి రీసెంట్ సూపర్ హిట్ సినిమా ‘టాక్సీవాలా’ వరకు స్టోరీ దగ్గరి నుండి, టైటిల్స్ వరకు పర్టికులర్ గా ఉండే విజయ్ దేవరకొండ ఈ సారి ‘హీరో’ గా మెస్మరైజ్ చేయబోతున్నాడు.

ప్రస్తుతం భరత్ కమ్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘డియర్ కామ్రేడ్’ తరవాత క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో నటిస్తాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తరవాత ’హీరో’ సెట్స్ పైకి వచ్చే చాన్సెస్ ఉన్నాయి.