F2 టీజర్ – నవ్వకుండా ఉండలేరు

Wednesday,December 12,2018 - 05:52 by Z_CLU

వెంకటేష్, వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ ‘F2’ టీజర్ రిలీజయింది. సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాపై న్యాచురల్ గానే ఓ మోస్తరు అంచనాలున్నాయి. కానీ రేపు వెంకటేష్ బర్త్ డే సందర్భంగా, ఈ రోజు రిలీజైన ఈ టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే F2, సంక్రాంతి సీజన్ కి 100% క్వాలిఫైడ్ క్వాలిటీస్ తో తెరకెక్కుతుందనే ఫీలింగ్ జెనెరేట్ చేస్తుంది ఈ టీజర్.

సినిమాలో తోడల్లుళ్ళు గా కనిపించనున్నారు వెంకటేష్, వరుణ్ తేజ్ లు. ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్ళికి ముందు సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్న మన హీరోలు, పెళ్ళి తరవాత పడే తిప్పలే సినిమాలోని మోస్ట్ ఫ్రస్ట్రేటెడ్ ఎలిమెంట్స్. అవే సినిమాలో మనకు కావాల్సినంత కామెడీని జెనెరేట్ చేయబోతున్నాయి. మరీ ముఖ్యంగా ‘వెంకీ ఆసన్’ టీజర్ కే హైలెట్ గా నిలుస్తుంది.

సినిమాలో మరో హైలెట్ ఏంటంటే ఇప్పటి వరకు క్లాస్ హీరోగా మెస్మరైజ్ చేసిన వరుణ్ తేజ్ ఈ సినిమాలో పక్కా మాస్, తెలంగాణ యాసలో మాట్లాడుతూ సరికొత్తగా కనిపించనున్నాడు. మరీ ముఖ్యంగా టీజర్ లో ‘నేను నీ లెక్క కాదు, పెళ్ళాన్ని కంట్రోల్ చేసుడు నాకు మస్తు తెలుసు’ అన్నప్పుడు వరుణ్ తేజ్ మ్యానరిజం ఫ్యాన్స్ కి తెగ నచ్చేస్తుంది.

జస్ట్ టీజరే ఇలా ఉంటే ఇంకా సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అనిపించడంలో కంప్లీట్ గా సక్సెసయ్యారు మేకర్స్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్స్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కపోజ్ చేస్తున్నాడు.