'టాక్సీవాలా' క్రియేటివ్ ప్రమోషన్స్

Friday,November 02,2018 - 11:32 by Z_CLU

విజయ్ దేవరకొండ ఏం చేసినా సోషల్ మీడియాలో సెన్సేషనే. దానికి తోడు ‘టాక్సీవాలా’ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ, ఫ్యాన్స్ లో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగిపోతుంది. దానికి తగ్గట్టే విజయ్ దేవరకొండ మరింత క్రియేటివ్ ప్రమోషన్స్ తో ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేయనున్నాడు.

‘టాక్సీవాలా’ సినిమా సెట్స్ పై ఉండగానే ‘The Dream Behind Taxiwala’ అంటూ ఇంట్రెస్టింగ్ వీడియో చేసి, సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసిన మేకర్స్, ఈ సినిమా ప్రమోషన్స్ ని రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేయనున్నారు.

త్వరలో ఈ సినిమా ప్రమోషన్ కి సంబంధించిన వీడియోస్ ని రిలీజ్ చేయనున్న ఫిల్మ్ మేకర్స్, వైడ్ రేంజ్ లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. రాహుల్ సంక్రిత్యాన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని గీతా ఆర్ట్స్ 2, UV క్రియేషన్స్ బ్యానర్ పై SKN నిర్మించారు. నవంబర్ 16 న రిలీజవుతుంది టాక్సీవాలా. ఈ సినిమాకి జేక్స్ బిజాయ్ మ్యూజిక్ కంపోజర్.