విజయ్ దేవరకొండ కొత్త సినిమా...

Wednesday,December 18,2019 - 01:10 by Z_CLU

ఈసారి విజయ్ దేవరకొండ కొత్త సినిమా దిల్ రాజు బ్యానర్ లో. ఈ విషయం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నదే. అయితే ఈ విషయాన్ని దిల్ రాజు బర్త్ డే సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్  చేశారు మేకర్స్. ఈ సినిమా శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కనుంది.

ప్రస్తుతం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ, ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా పూరి జగన్నాథ్ తో ‘ఫైటర్’ సినిమా చేస్తాడు. ఈ సినిమా తరవాత సెట్స్ పైకి రానుంది ఈ క్రేజీ కాంబినేషన్.

యూత్ ఫుల్ ఎమోషనల్ సినిమాల దర్శకుడిగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న శివ నిర్వాణ, విజయ్ దేవరకొండ కోసం తన స్టైల్ హార్ట్ టచింగ్  కథని రెడీ చేసుకున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నారు మేకర్స్.