క్రికెట్ నుండి బాక్సింగ్ కి...

Friday,October 11,2019 - 09:03 by Z_CLU

నిన్న మొన్నటివరకు టాలీవుడ్ స్టార్స్ వరసగా బ్యాట్ పట్టుకున్నారు. నాని నుండి స్టార్ట్ అయితే నాగచైతన్య, రష్మిక వరకు క్రికెటర్స్ గా స్క్రీన్ పై కనిపించిన వాళ్ళే. ఈ సినిమాల కోసం స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకుని మరీ ప్రొఫెషనల్ క్రికెటర్స్ లా కనిపించే ప్రయత్నం చేశారు… అయితే ఇప్పుడీ క్రేజ్ ఇంకో స్పోర్ట్ పైకి మళ్ళింది. టాలీవుడ్ చూపు క్రికెట్ నుండి బాక్సింగ్ కి మళ్ళింది.

పూరి, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ లా కనిపించబోతున్నాడు. ఇంకా సినిమా ప్రిపరేషన్స్ స్టార్ట్ అవ్వలేదు కానీ, కంప్లీట్ గా పూరి మార్క్ హీరోలా మారడానికి రెడీగా ఉన్న ఈ క్రేజీ హీరో బాక్సర్ గా మరింత అగ్రెసివ్ గా కనిపించబోతున్నాడు. ఈ వరసలో ఇప్పటికే వరుణ్ తేజ్ కూడా ఉన్నాడు.

ఈ మెగా హీరో ఇప్పటికే ఈ సినిమాకి కావాల్సిన ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. క్యారెక్టర్ కోసం పర్టికులర్ బరువు కూడా తగ్గాడు. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం కానున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ మరో కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు.

 ఈ 2 సినిమాలు సెట్స్ పైకి ఆడియెన్స్ లో క్రియేట్ అవుతున్న క్రేజ్ చూస్తుంటే ఈ బ్యాక్ డ్రాప్ లో మరిన్ని సినిమాల ప్లానింగ్ జరిగే అవకాశాలు జరుగుతున్నాయి. చూడాలి వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ తరవాత ఈ వరసలో పంచ్ కొట్టబోయే స్టార్ హీరో ఎవరో…