F3 Movie - వెంకటేష్ బ‌ర్త్‌డే  గ్లింప్స్ రిలీజ్

Monday,December 13,2021 - 04:22 by Z_CLU

Victory Venkatesh’s Birthday Glimpse From F3 Movie Out

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి ఈ సారి మూడు రెట్ల వినోదాన్ని ఇచ్చేందుకు ఎఫ్ 3 సినిమాతో రాబోతోన్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద శిరీష్ నిర్మిస్తున్నారు.

వెంకటేష్ బర్త్ డే సందర్బంగా ఎఫ్ 3 నుంచి వెంక‌టేష్ స్పెష‌ల్ పోస్ట‌ర్ తో పాటు బ‌ర్త్‌డే గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ  గ్లింప్స్‌లో చార్మినార్ వాతావరణంలో నవాబులా డబ్బుని చేతిలో పట్టుకుని ఊపుతూ హాయిగా కనిపించారు. వెంకటేష్ తన మ్యానరిజంతో అదరగొట్టేశారు.

నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్, సునీల్ వంటి వారితో ఈ సినిమా మరింత వినోదాత్మకంగా మారనుంది. తమన్నా, మెహరీన్‌లు నవ్వించడమే కాకుండా, తమ అందంతో కట్టిపడేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకాస్త గ్లామర్‌ను అద్దేందుకు సోనాల్ చౌహాన్ కూడా ఎంట్రీ ఇచ్చారు. మూడో హీరోయిన్‌గా ఎఫ్ 3లో సోనాల్ చౌహాన్ కనిపించబోతోన్నారు.

ఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్  చిత్రానికి సీక్వెల్ అవ్వడంతో అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.

హైద్రాబాద్‌లో గత కొన్ని రోజుల క్రితం ప్రారంభించిన ఈ సుధీర్ఘ షెడ్యూల్‌లో దాదాపు నటీనటులంతా కూడా పాల్గొంటున్నారు.

f3 movie

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఎఫ్ 3 కోసం సూపర్ హిట్ ఆల్బమ్‌ను రెడీ చేశారు. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా,  తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.