HANU-MAN - హీరోయిన్ ఫస్ట్ లుక్ విడుదల

Monday,December 13,2021 - 04:22 by Z_CLU

Makkal Selvan Vijay Sethupathi Introduces Amritha Aiyer As Meenakshi From The World Of Anjanandri In Prasanth Varma, Teja Sajja, Primeshow Entertainment’s HANU-MAN

స‌రికొత్త‌ కాన్సెప్ట్‌ల‌తో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో క్రియేటివ్ డైరెక్ట‌ర్ ప్రశాంత్ వర్మది సెపరేట్ స్టయిల్. ఇదే స్టయిల్ లో మరో డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు ఈ దర్శకుడు. హ‌ను-మాన్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్ జోనర్‌ను ఇంట్రడ్యూస్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. మొదటి పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీగా యంగ్‌ హీరో తేజ సజ్జతో క‌లిసి ప్రశాంత్ వర్మ తెర‌కెక్కిస్తోన్న `హను-మాన్` సినీ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ కానుంది.

ఈ మూవీ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు హనుమంత హార్ట్ బీట్‌ను మేకర్స్ ప్రకటించారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, హను-మాన్ హీరోయిన్ అమృత అయ్యర్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అంజనాద్రి ప్రపంచంలోని మీనాక్షి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ ఇది.

Amritha Aiyer HANU-MAN movie

చుట్టూ అందమైన ప్రకృతి, పక్షులతో అలా పడవలో మీనాక్షి ప్రయాణం చేస్తోంది. ఓ దేవకన్యలా కనిపిస్తున్న అమృతా అయ్యర్.. ఈ పాత్రకు సరిగ్గా సరిపోయింది. తేజ సజ్జ సూపర్ హీరో పాత్ర పోషించడానికి స్ట‌న్నింగ్‌ మేకోవర్ అయ్యాడు. తేజ గెటప్ చాలా కొత్తగా ఉంది.

మన పురాణాలు ఇతిహాసల్లో అద్భుతమైన శక్తులు ఉన్న సూపర్‌హీరోస్‌ గురించి మనకు తెలుసు. వారి అపూర్వమైన శక్తులు, బలాలు, పోరాటపటిమ అద్భుతమైనవి. సూపర్ హీరోస్‌ చిత్రాల్లోని హీరో ఎలివేషన్స్, యాక్షన్‌ సీక్వెన్సెస్‌ ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తాయి. అలాగే సూప‌ర్ హీరో మూవీస్‌ని అన్ని వ‌ర్గాల వారు ఇష్ట‌ప‌డ‌తారు. హ‌ను-మాన్ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో రూపొందుతోంది.

teja sajja prashanth varma hanu-man

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ చిత్రం కోసం నలుగురు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేస్తున్నారు. అనుదీప్ దేవ్, హరి గౌర, జయ్ క్రిష్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు.