వెన్నెల కిషోర్ బర్త్ డే స్పెషల్

Tuesday,September 19,2017 - 12:20 by Z_CLU

‘వెన్నెల’ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చేసుకున్న ఎనర్జిటిక్ కామెడీ స్టార్ వెన్నెల కిషోర్. యాక్షన్, రొమాంటిక్, హారర్ జోనర్ ఏదైనా, తన సిగ్నేచర్ మార్క్ ఎలివేట్ చేసిన వెన్నెల కిషోర్ ఈ రోజు 37వ పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు.

వెన్నెల సినిమాలో ఖాదర్ క్యారెక్టర్ తో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసిన వెన్నెల కిషోర్ కి టర్నింగ్ పాయింట్ కూడా ఈ సినిమానే. డిఫెరెంట్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ మాడ్యులేషన్ తో ఫిల్మ్ మేకర్స్ దృష్టినే కాదు, కామెడీ లవర్స్ ని కూడా మెస్మరైజ్ చేసిన వెన్నెల కిషోర్, ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ని కమెడియన్స్ లో ఒకడిగా కొనసాగుతున్నాడు.

2010 లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిన వెన్నెల కిషోర్.. బిందాస్, ఆరెంజ్, ఏమైంది ఈ వేళ లాంటి  సినిమాల్లో మంచి కామెడీ పాత్రలు పోషించాడు. ‘ఇంకోసారి’ సినిమాకిగాను బెస్ట్ కమెడియన్ గా నంది అవార్డు అందుకున్నాడు.

ఇక 2011 లో రిలీజైన అహ నా పెళ్ళంట, సీమ టపాకాయ్, దూకుడు, మడతకాజా, పిల్ల జమీందార్ సినిమాలు వెన్నెల కిషోర్ ని స్టార్ కమెడియన్ లెవెల్ కి తీసుకువెళ్ళాయి.

 

సినిమాలలో నటించడమే కాదు సోషల్ మీడియాలోను ఫ్యాన్స్ తో అప్ డేటెడ్ గా ఉండే వెన్నెల కిషోర్ సినిమా హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా తన మార్క్ కామెడీని జెనెరేట్ చేస్తూనే ఉన్నాడు. ఇదే క్రమంలో నాని హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ‘భలే భలే మగాడివోయ్’ సినిమాకి బెస్ట్ కమెడియన్ గా IIFA అవార్డు కూడా అందుకున్నాడు.

వెన్నెల కిషోర్ కరియర్ బిగిన్ చేసినప్పటి నుండి గమనిస్తే కిషోర్ లోని కామెడీ స్టామినాని ఎగ్జాక్ట్ గా  ఎలివేట్ చేసిన ఇయర్ 2016. ఈ సంవత్సరంలో చేసిన వరస సినిమాలు డిక్టేటర్, క్షణం, బ్రహ్మోత్సవం, జనతా గ్యారేజ్, జెంటిల్ మెన్ వీటితో పాటు అల్టిమేట్ హారర్ కామెడీ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా గ్రాండ్ సక్సెస్ లో మేజర్ రోల్ ప్లే చేశాడు వెన్నెల కిషోర్.

తాజాగా వచ్చి సూపర్ హిట్ అయిన ఆనందో బ్రహ్మ సినిమాలో వెన్నెల కిషోర్ కామెడీనే మేజర్ హైలెట్ గా నిలిచింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నవ్విస్తూ దూసుకుపోతున్న వెన్నెల కిషోర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది జీ సినిమాలు.