దర్శకుడి బర్త్ డేను సెలబ్రేట్ చేసిన నయన్

Tuesday,September 19,2017 - 01:32 by Z_CLU

హీరోయిన్ నయనతార ప్రస్తుతం న్యూయార్క్ లో ఉంది. అది కూడా తనకు బాగా నచ్చిన దర్శకుడు విఘ్నేష్ శివన్ పుట్టినరోజు కోసం న్యూయార్క్ వెళ్లింది నయన్. న్యూయార్క్ టైమ్స్ స్క్రేర్ వద్ద జరిగిన విఘ్నేష్ బర్త్ డే ను సెలబ్రేట్ చేసింది నయనతార.

తన పుట్టినరోజుకు సంబంధించిన స్టిల్స్ ను పోస్ట్ చేేశాడు దర్శకుడు విఘ్నేష్. ఇంత మంచి పుట్టినరోజును అందించిన దేవుడికి, ఆ తర్వాత నయనతారకు థ్యాంక్స్ చెప్పాడు. ఇంతటి అందమైన రోజు ఒకటి వస్తుందని కలలో కూడా ఊహించలేదని ట్వీట్ చేశాడు.

నయనతార-విఘ్నేష్ కాంబినేషన్ లో “నేనూ రౌడీనే” అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కంటే ముందు నయన్ వర్క్ చేసిన కొన్ని సినిమాలకు పాటల రచయితగా పనిచేశాడు విఘ్నేష్.