సెప్టెంబర్ 19 నుండి బరిలోకి..

Sunday,September 18,2016 - 09:00 by Z_CLU

 తాజాగా బాబు బంగారం తో విజయం అందుకున్న విక్టరీ వెంకటేష్ తన తదుపరి సినిమాకు సిద్ధం అయ్యాడు. ఇందు కోసం బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘సాలా-ఖదూస్ ‘ ను ఎంచుకున్నాడు వెంకీ. బాలీవుడ్ లో ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వం లోనే తెరకెక్కనున్న ఈ చిత్రానికి తాజాగా టైటిల్ ఖరారు చేశారు యూనిట్. సెప్టెంబర్ 19 నుండి ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను ప్రారంభించనున్నారు యూనిట్.

venky-guru-final

గురు శిష్యుల మధ్య జరిగే కథ తో రూపొందనున్న ఈ సినిమాకు ‘గురు’ అనే టైటిల్ ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేశారు. ఈ సినిమా కోసం బాగా వెంకీ బాగా కష్టపడ్డాడనే చెప్పాలి. ఈ సినిమా లో ఓ కోచ్ గా కనిపించడం కోసం చాలా కసరత్తులు చేసి ఫైనల్ గా ఆ లుక్ తీసుకొచ్చాడు విక్టరీ. ఈ చిత్రం లో వెంకీ లుక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 50 ఏళ్ల ఈ సీనియర్ హీరో ఓ సినిమా కోసం ఇంతగా శ్రమించడం చూసి అవాక్కవుతున్నారు కుర్ర హీరోలు..