రెచ్చిపోతున్న బాలయ్య

Sunday,September 18,2016 - 07:00 by Z_CLU

నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక 100 వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో చిత్రీకరణను జరుపుకుంటుంది. క్రిష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి చిరంతన్‌ భట్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటను చిత్రీకరిస్తున్నారు యూనిట్.

     సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ పాట ను సీనియర్‌ డ్యాన్స్‌ మాస్టర్‌ స్వర్ణ నృత్య దర్శకత్వంలో మధ్యప్రదేశ్‌లో చిత్రీకరిస్తున్నారు. ముంబైకి చెందిన క్లాసికల్‌ డ్యాన్సర్స్‌ ఈ పాటలో నర్తిస్తున్నారు. సెప్టెంబర్‌ 25 వరకు జరిగే ఈ సాంగ్‌ చిత్రీకరణతో 80 శాతం సినిమా పూర్తవుతుంది. ఈ సినిమా లోని ప్రతి సన్నివేశం పై బాలయ్య ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని, ఈ పాట పై ఆయన మరింత ఆసక్తి తో నర్తిస్తున్నారని అంటున్నారు చిత్ర యూనిట్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.