'వెంకీ మామ' అప్ డేట్స్

Sunday,February 17,2019 - 02:49 by Z_CLU

విక్టరీ వెంకటేష్ , నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘వెంకీ మామ’ రెగ్యులర్ షూటింగ్ కి ముహూర్తం ఫిక్సయింది. ఇటివలే గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ సినిమా ఫిబ్రవరి 24 నుండి సెట్స్ పైకి రానుంది. బాబీ డైరెక్షన్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా మొదటి షెడ్యుల్ రాజమండ్రి లో జరగనుంది. దాదాపు 25 రోజుల పాటు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు.

సినిమాలో వెంకటేష్ పల్లెటూర్లో ఓ వ్యాపార వేత్తగా కనిపిస్తాడని , నాగ చైతన్య ఆర్మీ ఆఫీసర్ గా నటించనున్నాడని తెలుస్తోంది. శ్రియా , రకుల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై సురేష్ బాబు , భరత్ చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.