నాగ్ - రాహుల్ రవీంద్రన్ మూవీ అప్ డేట్స్

Sunday,February 17,2019 - 03:50 by Z_CLU

రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు నాగార్జున. ప్రస్తుతానికైతే ఎలాంటి అనౌన్స్ మెంట్ లేదు కానీ ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ జెట్ స్పీడ్ లో జరుగుతోందని తెలుస్తోంది. ఇప్పటికే హీరోయిన్ తో పాటు మిగతా ఆర్టిస్టులను కూడా కన్ఫర్మ్ చేసుకున్నారని, నాగ్ సరసన పాయల్ రాజ్ పుత్  హీరోయిన్ గా నటించనుందని సమాచారం. మార్చ్ నెలాఖరున సెట్స్ పైకి రానున్న ఈ సినిమాకు మన్మడుడు 2 టైటిల్ ను పరీశిలిస్తున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించి మార్చ్ ఫస్ట్ వీక్ లో బ్యానర్ ద్వారా  అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ‘చిలసౌ’ తో అందరినీ మెప్పించిన రాహుల్ ఈ సినిమాలో నాగ్ ని ఎలా ప్రెజెంట్ చేస్తాడో.. అని ఎదురుచూస్తున్నారు అక్కినేని ఫాన్స్.