రీమేక్ తర్వాతే స్ట్రైట్ సినిమా

Sunday,February 17,2019 - 12:52 by Z_CLU

తేజ డైరెక్షన్ లో ‘సీత’ సినిమా చేస్తున్నాడు బెల్లం కొండ శ్రీనివాస్.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫినిషింగ్ స్టేజిలో ఉంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే  నెక్స్ట్ సినిమాలను కూడా లేటెస్ట్ గా కన్ఫర్మ్ చేసేసుకున్నాడు బెల్లం కొండ. రమేష్ వర్మ డైరెక్షన్ లో ‘రాట్ససన్’ రీమేక్ కు రెడీ అవుతున్న ఈ యంగ్ హీరో మరో వైపు ఆర్.ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి చెప్పిన కథకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.

ముందుగా రీమేక్ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని భావిస్తున్నాడట బెల్లం కొండ. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 21 న గ్రాండ్ లాంచ్ కానుందని , మార్చ్ నుండి రెగ్యులర్ షూట్ జరుపుకోనుందని సమాచారం. తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ గిబ్రన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకు సత్యనారయణ కోనేరు నిర్మాత.