మూడు సినిమాలతో వెంకీ ...

Sunday,December 17,2017 - 11:02 by Z_CLU

‘గురు’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంకటేష్ ఆ గ్యాప్ లో ఓ మూడు సినిమాలు ఫైనలైజ్ చేసుకున్నాడు. ‘గురు’ తర్వాత వెంకటేష్ పూరితో పాటు క్రిష్ దర్శకత్వం లో కూడా సినిమా చేస్తాడనే వార్తలు వినిపించాయి.. కాని ఫైనల్ గా తేజ తో నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేసాడు వెంకీ.. ఇక ఈ గ్యాప్ లో ఎప్పటి నుంచో నానుతున్న త్రివిక్రమ్ సినిమాను కూడా ఫైనల్ చేసుకున్నాడు.

ఈ రెండు సినిమాలతో పాటు టాలీవుడ్ లో మూడు సూపర్ హిట్స్ సాధించిన యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో కూడా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు వెంకటేష్. మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ కీ రోల్ ప్లే చేస్తూ న్యూ వే లో ఎంటర్టైన్ చేయబోతున్నాడట. సో గురు తర్వాత కొన్ని నెలలు గ్యాప్ తీసుకున్న దగ్గుబాటి హీరో ఈ గ్యాప్ లో మూడు సినిమాలు ఫైనల్ చేసి నెక్స్ట్ ఇయర్ లో ఈ సినిమాలను సెట్స్ పై పెట్టాలని చూస్తున్నాడు.