ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో వరుణ్ తేజ్-సంకల్ప్ సినిమా...

Sunday,December 17,2017 - 12:06 by Z_CLU

ఈ ఏడాది  ‘ఘాజీ’ సినిమాతో తానేంటో నిరూపించుకొని ప్రముఖుల నుంచి ప్రశంశలు అందుకున్న దర్శకుడు సంకల్ప్ మెగా హీరో వరుణ్ తేజ్ తో నెక్స్ట్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ యంగ్ డైరెక్టర్ చెప్పిన స్క్రిప్ట్ కి ఫిదా అయిన వరుణ్ తేజ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ అయ్యాడు సంకల్ప్.

సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకి గ్రాఫిక్స్ కీలకం కావడంతో ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ నిపుణులతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడట సంకల్ప్.. స్క్రిప్ట్ పూర్తయినప్పటికీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం ఇంకొన్ని నెలలు టైం తీసుకోనున్నాడట ఈ దర్శకుడు. సో వరుణ్ -సంకల్ప్ సినిమా స్టార్ట్ అవ్వడానికి ఇంకాస్త టైం పట్టేలా ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.