జూన్ లో వెంకటేష్ జూలై నుండి వరుణ్ తేజ్

Friday,June 22,2018 - 12:22 by Z_CLU

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కనున్న  F2 ( ఫన్ & ఫ్రస్ట్రేషన్ ) రేపు గ్రాండ్ గా లాంచ్ కానుంది. రీసెంట్ గా అఫీషియల్ గా  ఈ సినిమాను అనౌన్స్ చేసిన ఫిల్మ్ మేకర్స్, రేపు పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు.

జస్ట్ టైటిల్ తోనే సినిమా ఏ జోనర్ లో ఉండబోతుందోనన్న క్లారిటీ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి, మోస్ట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన స్టార్ కాస్ట్ ని కూడా ఫిక్స్ చేసుకున్న ఫిల్మ్ మేకర్స్, రేపు జరగబోయే ఈ కార్యక్రమంలో సినిమాకి సంబంధించి  మరిన్ని విషయాలు రివీల్ చేయనున్నారు.

రేపు మార్నింగ్ 9 గంటలకు గ్రాండ్ గా లాంచ్ కానున్న ఈ సినిమా జూన్ 30 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఫస్ట్ షెడ్యూల్ లో వెంకటేష్ తో సినిమాలోని కీలక సన్నివేశాలను ప్లాన్ చేసుకున్న ఫిల్మ్ మేకర్స్,  వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ఉండబోయే సీన్స్ ని జూలైలో తెరకెక్కించనున్నారు.

వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహరీన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.