'చినబాబు' రిఫరెన్స్ తో సూర్య సరసన ఛాన్స్

Friday,June 22,2018 - 12:47 by Z_CLU

‘అఖిల్’ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది సాయేష. ఈ సినిమా తర్వాత కోలీవుడ్ లో బిజీ అయిపోయిన ఈ ముంబై భామ వరస సినిమాలతో స్పీడ్ మీదుంది. ఇప్పుడు అదే స్పీడ్ తో సూర్య సరసన నటించే లక్కీ చాన్స్ కొట్టేసింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ, కార్తి సరసన చినబాబు అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీలో సాయేషా డెడికేషన్ చూసిన కార్తి, స్వయంగా అన్నయ్య సూర్యకు రిఫర్ చేశాడు. అలా సూర్య-కేవీ ఆనంద్ కాంబోలో హీరోయిన్ గా సెలక్ట్ అయింది సాయేషా. ఇదే మూవీలో మెగా హీరో అల్లు శిరీష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మోహన్ లాల్, బొమన్ ఇరానీ కూడా మరో రెండు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

గతంలో సూర్య-కేవీఆనంద్ కాంబోలో బ్రదర్స్ అనే డిఫరెంట్ మూవీ వచ్చింది. అందులో అవిభక్త కవలలుగా నటించాడు సూర్య. ఇప్పుడు కూడా కేవీ ఆనంద్ సినిమాలో 4 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడట. ఈనెల 25 లేదా 26 నుంచి లండన్ లో ఈ సినిమా మొదలవుతుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రానున్న ఈ సినిమాకు హరీష్ జైరాజ్ సంగీత దర్శకుడు.