మాస్ మహారాజా ముందెవరితో ?

Sunday,September 29,2019 - 01:25 by Z_CLU

ప్రస్తుతం విఐ ఆనంద్ డైరెక్షన్ లో డిస్కో రాజా చేస్తున్న రవి తేజ. నెక్స్ట్ గోపీచంద్ మలినేనితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇటివలే అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ నుండి షూట్ మొదలు కానుంది. అయితే ఈ సినిమా తర్వాత మాస్ మహారాజ్ సుదీర్ వర్మతో సినిమా చేస్తాడనే టాక్ ఉంది.

రీసెంట్ గా ‘రాక్షసుడు’ తో సూపర్ హిట్ కొట్టిన రమేష్ వర్మతో రవి తేజ చర్చలు జరిపారని వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రానుందనే వార్త కూడా చక్కర్లు కొడుతుంది. గతంలో వీరిద్దరూ కలిసి ‘వీర’ సినిమా చేసారు. ఇక సుదీర్ వర్మ, రమేష్ వర్మ వీరిద్దరిలో రవితేజ ముందుగా ఎవరితో సినిమా చేస్తాడో..తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.