షూటింగ్ అప్ డేట్స్

Sunday,September 29,2019 - 11:02 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.


నాని -సుదీర్ బాబు నటిస్తున్న ‘వి’ సినిమా థాయిలాండ్ షెడ్యుల్ పూర్తి చేసుకుంది. దాదాపు పన్నెండు రోజుల పాటు జరిగిన షెడ్యుల్ లో ఓ పాటను ఫైట్ సీక్వెన్స్ ను షూట్ చేసారు. నాని, సుదీర్ బాబు , వెన్నెల కిశోర్, కృష్ణ తేజ లతో పాటు మరికొందరు ఆర్టిస్టులు పాల్గొన్నారు. త్వరలోనే హైదరాబాద్ లో మరో షెడ్యుల్ స్టార్ట్ అవుతుంది.


కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘ఎంత మంచి వాడవురా’ రెండో షెడ్యుల్ పూర్తి చేసుకుంది. రాజమండ్రిలో దాదాపు నెల రోజులు జరిగిన షెడ్యుల్ లో ఒక ఐటెం సాంగ్ ను అలాగే కొన్ని సన్నివేశాలను, యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేసారు. అక్టోబర్ 9 నుంచి 22 వ‌ర‌కూ హైద‌రాబాద్‌లో మూడో షెడ్యూల్ జరగనుంది. ఆ త‌ర్వాత నాలుగ‌వ షెడ్యూల్లో కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌ల్లో ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా థియేటర్స్ లోకి రానుంది.


విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూట్ నడుస్తోంది. త్వరలోనే యూరోప్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. వచ్చే నెల రెండో వారం నుంచి యూరోప్ లో సినిమాకు సంబంధించి భారీ షెడ్యూల్ సెట్ చేశారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ లోనే కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ సినిమాకు క్రాంతిమాధవ్ దర్శకుడు. విజయ్ సరసన రాశిఖన్నా, క్యాథరీన్, ఐశ్యర్య రాజేష్, ఇజబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు.


ఆది పినిశెట్టి హీరోగా అథ్లెటిక్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న `క్లాప్‌’ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. సినిమా కోసం వేసిన భారీ సెట్‌లో మోనాల్ గ‌జ్జ‌ర్ పై స్పెషల్ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం అందించిన ఈ పాటకు దినేశ్ మాస్ట‌ర్ కోరియోగ్రఫీ చేస్తున్నారు. రామాంజ‌నేయులు జ‌వ్వాజి, యం .రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రిత్వి ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు.


నాగ శౌర్య‌, బ‌బ్లీ బ్యూటీ మెహ‌రిన్ జంట‌గా ర‌మ‌ణ తేజ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి వైజాగ్ షెడ్యుల్ పూర్తి చేసుకుంది. వైజాగ్ లో అన్బు అరివు మాస్ట‌ర్స్ కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు షూట్ చేసిన యూనిట్ అక్టోబర్ నుంచి మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఐరా క్రియేష‌న్స్ ప‌తాకం పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.