వెంకీ స్టార్ట్ చేసాడు...

Friday,December 23,2016 - 05:30 by Z_CLU

‘గురు’ సినిమాతో త్వరలో థియేటర్స్ లో అడుగు పెట్టబోతున్న విక్టరీ వెంకటేష్ ఈ సినిమా రిలీజ్ కి ముందే మరో సినిమాను సెట్స్ పై పెట్టడానికి రెడీ  అయ్యాడు. ఇటీవలే గురు షూటింగ్ ఫినిష్ చేసిన వెంకీ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కనున్న ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ సినిమాను త్వరలోనే సెట్స్ పై పెట్టడానికి రెడీ అయ్యాడు.

   వెంకీ సరసన నిత్య మీనన్ నటించనున్న ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ముగింపు దశ కు చేరుకుంది. అవుట్‌ అండ్‌ అవుట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ చేశారు యూనిట్. ప్రెజెంట్ మ్యూజిక్ డైరెక్టర్ గోపిసుందర్ ఆధ్వర్యం లో మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నాడట దర్శకుడు కిషోర్. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాను జనవరి లోనే సెట్స్ పెట్టాలని చూస్తున్నాడు వెంకీ.