అదరగొడుతున్న మెగా స్టార్

Friday,December 23,2016 - 04:45 by Z_CLU

మెగా స్టార్ చిరంజీవి హీరో గా రీఎంట్రీ ఇస్తున్నాడని తెలియగానే అందరిలో కలిగిన మొదటి ప్రశ్న ఇంతకీ చిరు సరసన నటించే ఆ హీరోయిన్  ఎవరు? అందుకే ‘ఖైదీ నంబర్ 150’  సినిమా కి హీరోయిన్ విషయంలో కాస్త కేర్ తీసుకొని మరీ  ఫైనల్ గా కాజల్ ను ఫిక్స్ చేశారు యూనిట్. కాజల్ మెగాస్టార్ తో నటించబోతుందనగానే… ఏజ్ డిఫరెన్స్ కారణంగా చందమామ సరసన చిరు తేలిపోతాడేమో అనే డౌట్స్ రెయిజ్ అయ్యాయి. అయితే అలా అనుకున్న అందరికీ కేవలం ఒకే ఒక్క పోస్టర్ తో  సమాధానం చెప్పాడు మెగాస్టార్.

 ‘ఖైదీ నంబర్ 150’ ఫస్ట్ లుక్ లో మెగా స్టైలిష్ లుక్ తో  మెస్మరైజ్ చేసిన చిరు… లేటెస్ట్ గా టీజర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేశాాడు. ఆరు పదుల వయసులో కూడా తనలో ఛరిష్మా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు.  లేటెస్ట్ గా కాజల్ తో ఉన్న మరో పోస్టర్ తో తన వయసు గురించి మాట్లాడుకునే వాళ్లందరికీ షాక్ ఇచ్చి షేక్ చేశాడు చిరు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ పోస్టర్ తో సోషల్ మీడియాలో బ్రహ్మాండమైన రెస్పాన్స్ తో అదరగొట్టేస్తున్నాడు మెగాస్టార్.