మరో సునామీకి రెడీ

Friday,December 23,2016 - 07:29 by Z_CLU

ఇప్పటికే అమ్మడు..లెట్స్ డు కుమ్మడు సాంగ్ తో సోషల్ మీడియాను కమ్మేశాడు మెగాస్టార్. ఈ సునామీ ఇంకా సద్దుమణగక ముందే ఇప్పుడు మరో తుఫాన్ కు రెడీ అవుతున్నాడు. అవును.. రేపు ఖైదీ నంబర్ 150 నుంచి మరో సాంగ్ ను నెట్ లో విడుదల చేయబోతున్నాడు మెగాస్టార్. సుందరి అనే లిరిక్స్ తో సాాగే ఈ సాంగ్.. రేపు సాయంత్రం సరిగ్గా 6 గంటలకు రిలీజ్ కానుంది. దీంతో మెగా పండగ డబుల్ కావడం గ్యారెంటీ అంటున్నారు.

khaidi-no-150-new-still

ఇలా దశలవారీగాా అన్ని పాటల్ని నేరుగా మార్కెట్లోకి విడుదల చేయాలని ఖైదీ నంబర్-150 టీం నిర్ణయించింది. పాటలన్నీ రిలీజ్ అయిన తర్వాత.. వచ్చేనెల 4న విజయవాడలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేేయబోతోంది.