‘పోకిరి’ తరవాత ఇస్మార్ట్ శంకర్..?

Saturday,October 26,2019 - 10:03 by Z_CLU

‘ఇస్మార్ట్ శంకర్’ బాలీవుడ్ లో రీమేక్ కానుందా…? ఈ మధ్య చాలా సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి. ఇది కూడా ఆ వరసలో చేరితే ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఈ రీమేక్ సల్మాన్ ఖాన్ చేయబోతున్నాడా…? ఈ ఆలోచనే సోషల్ మీడియాలో వైబ్స్ క్రియేట్ చేస్తుంది. ఇంతకీ ఈ బజ్ లో నిజమెంత…?

ఈ సినిమా రీమేక్ కి సంబంధించి ఎక్కడా అఫీషియల్ అప్డేట్ లేదు. కానీ రీసెంట్ గా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పూరి జగన్నాథ్ గురించి మాట్లాడుతూ తన కరియర్ లో ‘వాంటెడ్’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో గుర్తు చేసుకున్నాడు. దాంతో పాటు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ అయిన పూరి సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ గురించి చాలా గొప్పగా ప్రస్తావించాడు.

సల్మాన్ ఖాన్ ఇచ్చిన కాంప్లిమెంట్ కి ఇంకా పూరి నుండి ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు కానీ, ఫ్యాన్స్ లో మాత్రం సల్మాన్ ఖాన్ ఈ ‘ఇస్మార్ట్ శంకర్’ ని బాలీవుడ్ లో రీమేక్ చేయాలనే ఆలోచన బలంగా క్రియేట్ అయిందనిపిస్తుంది.

టాలీవుడ్ లో ప్రయోగాత్మకంగా తెరకెక్కింది. ఓ వరసలో వెళ్తున్న ట్రెండ్ ని ఒక్కసారిగా దారి మళ్ళించింది ఈ సినిమా. సల్మాన్ ఖాన్ కూడా ఇలాంటి ప్రయోగాలకు ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉంటాడు. మరి ‘ఇస్మార్ట్ శంకర్’ విషయంలో ఏం చేయబోతున్నాడు…? అందరూ ఎక్స్ పెక్ట్ చేస్తున్నట్టు ఈ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ చూడాలి. ఇదే గనక జరిగితే సల్మాన్ ఖాన్ కరియర్ లో ‘పోకిరి’ రీమేక్ ‘వాంటెడ్’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో, ఈ సినిమా కూడా అదే స్థాయి అందుకుంటుంది అది మాత్రం గ్యారంటీ.