సందీప్ రెడ్డి నెక్ట్స్ సినిమా కూడా..!

Thursday,October 10,2019 - 02:44 by Z_CLU

అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించాడు
కబీర్ సింగ్ తో బాలీవుడ్ ను షేక్ చేశాడు
ఇలా రెండు లాంగ్వేజెస్ లో ఒకే ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి., తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేశాడు. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ, తన రెండో సినిమాను బాలీవుడ్ లో చేస్తున్నాడు సందీప్ రెడ్డి. టీ-సిరీస్ నిర్మాణంలో ఈ సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని కొద్దిసేపటి కిందట అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.

లెక్కప్రకారం, కబీర్ సింగ్ సినిమా తర్వాత మహేష్ బాబుతో కలిసి సెట్స్ పైకి వెళ్లాలి సందీప్ రెడ్డి. కానీ మహేష్ బాబు తన నెక్ట్స్ సినిమాపై ఎలాంటి ప్రకటన చేయలేదు. సందీప్ సినిమాను హోల్డ్ లో పెట్టాడు. దీంతో బాలీవుడ్ లో తన రెండో సినిమాను ప్రకటించాడు సందీప్.

ఈ ఏడాది ఇప్పటివరకు ఇండియాలో అత్యథిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది కబీర్ సింగ్. కేవలం కలెక్షన్స్ పరంగానే కాదు, కాంట్రవర్సీస్ తో కూడా పాపులర్ అయ్యాడు సందీప్ రెడ్డి. కచ్చితంగా బాలీవుడ్ లో మరో సినిమా చేస్తానని అప్పట్లోనే ఎనౌన్స్ చేసిన సందీప్ రెడ్డి, ఇప్పుడు అన్నంత పని చేశాడు. సో.. టాలీవుడ్ కు ఈ దర్శకుడు మరోసారి దూరమయ్యాడన్నమాట.