చెర్రీ కి కలిసొచ్చింది...

Saturday,December 03,2016 - 03:37 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ధృవ’ తో ఎంటర్ టైన్ చేయడానికి  రెడీ అయ్యాడు. డిసెంబర్ 9 నుండి వసూళ్ల తో బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించాలని చూస్తున్న చెర్రీ కి అన్ని కలిసొస్తున్నాయి  . ఇప్పటికే టీజర్, ట్రైలర్  యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడం తో  సినిమా పై అంచనాలు భారీ స్థాయి లో నెలకొన్నాయి. అయితే  ఈ సినిమాను ముందుగా డిసెంబర్ 2 విడుదల చేయాలనుకున్న యూనిట్ నోట్ల మార్పిడి కారణంగా ఆ డేట్ ను కాస్త పోస్ట్ పోన్ చేసి 9న విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక షూటింగ్ దశలోనే సూర్య నటిస్తున్న ‘సింగం-3 ‘ సినిమాను డిసెంబర్ 16 విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్.

 గతం లో సూర్య నటించిన ‘సింగం’,’సింగం- 2 ‘సినిమాలుతెలుగులోనూ మంచి కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్స్ గా నిలవడం, సూర్య కి తెలుగు లోనూ మంచి క్రేజ్ ఉండడం తో చెర్రీ కలెక్షన్స్ కి సూర్య అడ్డు కట్ట వేస్తాడని అనుకున్నారంతా. అయితే సూర్య ఈ డేట్ నుండి వెనక్కి తగ్గి 23 కి వెళ్లడం తో ఇక చెర్రీ కి బాగా కలిసొచ్చింది. సూర్య సినిమాకు దాదాపు రెండు వారల గ్యాప్ ఉండడం, ఈ నెలలో మరో బడా సినిమా లేకపోవడం తో ఇక మెగా పవర్ స్టార్ ధృవ తో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అందుకోవాలని భావిస్తున్నాడు. మరి ఈ సినిమాతో రామ్ చరణ్ ఎంత కలెక్ట్ చేస్తాడో ? చూడాలి.