పవన్ కోసం త్రివిక్రమ్... కానీ కుదరలేదు

Sunday,June 07,2020 - 02:04 by Z_CLU

రెండేళ్ళ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’. ప్రస్తుతం సగంపైనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి దర్శకుడు వేణు శ్రీ రామ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ తనకు వస్తుందని అస్సలు ఊహించలేదని అన్నాడు.

“షూటింగ్ కి ముందు ఈ సినిమాకు త్రివిక్రమ్ రాస్తానన్నారు. కానీ ఆయన ‘అల వైకుంఠపురములో’ హడావుడిలో ఉండటం వల్ల అది కుదరలేదు. ఆ సినిమా విడుదలైన 4-5 రోజులకే మా సినిమా షూటింగ్ మొదలైంది.”

ఇక పవన్ కళ్యాణ్ గారితో పనిచేస్తూ ఆయన ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపాడు వేణు శ్రీరాం. కంగారులో కూడా గారు అని సంభోదించడం మర్చిపోరని , అలాగే షూటింగ్ గ్యాప్ లో అందరి గురించి అడిగి తెలుసుకుంటారని, పుస్తకాలు చదివే అలవాటుందా ? అంటూ ఏ పుస్తకం చదివారని కచ్చితంగా తెలుసుకుంటారని చెప్పుకొచ్చాడు.

పవన్ కళ్యాణ్ పై తీసిన మొదటి షాట్ నే ఫస్ట్ లుక్ గా వదిలామని ఈ సందర్భంగా తెలిపాడు వేణు శ్రీరామ్.