ప్లాన్ మార్చిన "పుష్ప"

Sunday,June 07,2020 - 02:17 by Z_CLU

మరో వారం రోజుల్లో షూటింగ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని యూనిట్స్ ఆ మేరకు పనులు ప్రారంభించాయి. చాన్నాళ్లుగా ఈ రోజు కోసం ఎదురుచూస్తున్న పుష్ప యూనిట్ కూడా షూటింగ్ కు రెడీ అవుతోంది. కాకపోతే ప్లాన్ లో చిన్న మార్పు.

లెక్కప్రకారం లాక్ డౌన్ తర్వాత ఈస్ట్ గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అనే అటవీ ప్రాంతంలో పుష్ప షూట్ స్టార్ట్ అవ్వాలి. కానీ లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. నెక్ట్స్ షెడ్యూల్ ను ఇండోర్ లో ప్లాన్ చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదు. ఇలాంటి టైమ్ లో ఔట్ డోర్ షూటింగ్స్ రిస్క్. అలాఅని సినిమా షూట్ ను పోస్ట్ పోన్ చేయలేరు. అందుకే తక్కువమంది సిబ్బందితో పని పూర్తయ్యేలా, ఇండోర్ లో షూట్ చేయాలని ప్లాన్ చేశారు.

ఈ ఇండోర్ షూటింగ్ కు బన్నీ ఎటెండ్ అవ్వడని తెలుస్తోంది. కేవలం కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులతో, రష్మిక ఓకే అంటే ఆమె కాంబినేషన్ సీన్లను షూట్ చేయాలనుకుంటున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తున్న పుష్ప సినిమాకు సుకుమార్ దర్శకుడు.