దర్శకేంద్రుడిపై భారం వేసిన శ్రీకాంత్

Sunday,June 07,2020 - 01:56 by Z_CLU

ప్రస్తుతం సీనియర్ హీరోల వారసులు టాలీవుడ్ లో చక్రం తిప్పుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్టులోకి శ్రీకాంత్ కూడా తన కొడుకుని తీసుకురావాలనుకుంటున్నాడు.

నాగార్జున నిర్మాణంలో ‘నిర్మల కాన్వెంట్’ సినిమా ద్వారా రోషన్ నటుడిగా పరిచయమయ్యాడు. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఆ సినిమా వర్కౌట్ అవ్వకపోవడంతో గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు రోషన్ ను పూర్తి స్థాయి హీరోగా తీర్చిదిద్దే బాధ్యతను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తీసుకున్నట్లు తెలుస్తుంది.

రోషన్ కోసం ఆయన కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ నిర్మాతగా కూడా మారబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాను ఆయన అసిస్టెంట్ గౌరీ డైరెక్ట్ చేయనుందట. అలాగే దిల్ రాజు కూడా ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామిగా ఉంటారని సమాచారం.

త్వరలోనే రాఘవేంద్రరావు ఈ సినిమాను అనౌన్స్ చేస్తారట.