ఆచార్యలో సాంగ్స్.. వాటి డీటెయిల్స్

Monday,July 13,2020 - 12:33 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో పాటలపై మణిశర్మ ఓపెన్ అయ్యాడు.

ఆచార్యలో మొత్తం 5 పాటలున్నాయి. వీటిలో ఒకటి ఐటెంసాంగ్ కాగా.. ఇంకోటి ఎమోషనల్ సాంగ్. మిగతా 3 పాటలు డ్యూయట్స్. వీటిలో ఐటెంసాంగ్ షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది. చిరంజీవి-రెజీనాపై ఆ పాట షూట్ పూర్తిచేశారు.

మిగిలిన పాటల రికార్డింగ్ కూడా పూర్తయిందని తెలిపాడు మణిశర్మ. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతడికి కూడా సాంగ్ ఉంటుందా ఉండగా అనే విషయాన్ని మణిశర్మ దాటేశాడు.