అఖిల్ ఖాతాలో మరో దర్శకుడు?

Monday,July 13,2020 - 12:59 by Z_CLU

ఇప్పటికే సురేందర్ రెడ్డి పేరు తెరపైకొచ్చింది. ఓ మంచి మాస్ స్టోరీ రెడీ చేసినట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు అఖిల్ లిస్ట్ లో మరో దర్శకుడి పేరు కూడా వినిపిస్తోంది. అతడి పేరు వీరుపోట్ల

అవును… అఖిల్ కోసం వీరుపోట్ల కూడా ఓ కథ సిద్ధం చేశాడట. స్టయిలిష్ గా ఉంటూనే, మాస్ అప్పీల్ ఉండే కథలో అఖిల్ ను చూపించబోతున్నాడట. ఈ ప్రాజెక్టు సెట్ అయితే, లాంగ్ గ్యాప్ తర్వాత వీరు పోట్ల చేయబోయే సినిమా ఇదే అవుతుంది.

ఇంతకుముందు రగడ సినిమాతో నాగ్ ను డైరక్ట్ చేశాడు ఈ దర్శకుడు. హిట్ మూవీ బిందాస్ కూడా ఇతడిదే.

రీసెంట్ గా సరైన సక్సెస్ లేని వీరుపోట్లకు అఖిల్ ఛాన్స్ ఇస్తాడంటున్నారు చాలామంది. ఎందుకంటే ప్రస్తుతం అఖిల్ ను డైరక్ట్ చేస్తున్న బొమ్మరిల్లు భాస్కర్ కూడా కెరీర్ లో లాంగ్ గ్యాప్ తీసుకున్న దర్శకుడే కదా.