బడా దర్శకులు బోల్తా కొట్టారు

Sunday,November 18,2018 - 11:50 by Z_CLU

ఈ ఏడాది ముగ్గురు స్టార్ డైరెక్టర్స్ బాక్సాఫీస్ దగ్గర అపజయాలు అందుకున్నారు. వాళ్ళే పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల, వినాయక్ . ఖైదీ నంబర్ 150 మినహా ముందు వెనక రెండు అపజయాలు చవిచూసాడు వినాయక్.. పూరి కూడా  హిట్ కొట్టి చాలా ఏళ్ళవుతుంది… ఇక శ్రీను వైట్ల వరుసగా నాలుగు అపజయాలు అందుకున్నాడు.

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ హిట్టు కొడితే… అందులో విశేషం ఏముందిలే.. కొత్త దర్శకుడు హిట్ కొడితే కదా విశేషం అనుకునే వారు.. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. కొత్త దర్శకులు హిట్టు కొట్టడం మామూలే కానీ స్టార్ డైరెక్టర్స్ హిట్ కొట్టడం గగనం అనిపిస్తుంది. నిజానికి స్టార్ డైరెక్టర్ నుండి ఓ సినిమా వస్తుందంటే ఎన్నో అంచనాలతో థియేటర్స్ కి వస్తారు ప్రేక్షకులు. అలా అంచనాలతో వచ్చిన ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఎంటర్టైన్  చేయలేకపోతున్నారు  స్టార్ డైరెక్టర్స్.

దీనికి కారణం కొందరు స్టార్ డైరెక్టర్స్ ఇంకా మూస దోరణిలోనే కథలు రాసుకుంటూ ఓల్డ్ ఫార్మేట్ ని నమ్ముకోవడమే. ఈ స్టార్ డైరక్టర్ల స్టామినాను ఎవరూ తక్కువ అంచనా వేయడం లేదు. సరైన కథలు దొరక్కపోవడమే వీళ్లకు పెద్ద సమస్యగా మారింది. అదే వీళ్లను ఫ్లాప్ డైరక్టర్లుగా మార్చేస్తోంది. వచ్చే ఏడాదైనా ఈ స్టార్ డైరక్టర్లు బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఆశిద్దాం