టైటిల్ ఫిక్స్ చేసుకున్న ప్రభాస్

Sunday,November 18,2018 - 10:10 by Z_CLU

సుజీత్ డైరెక్షన్ లో ‘సాహో’ సినిమా చేస్తున్న ప్రభాస్ రాదా కృష్ణ తో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే… ప్రస్తుతం యూరప్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసుకున్నాడు ప్రభాస్. యూ.వి క్రియేషన్స్ , గోపి కృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘జాన్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం.

త్వరలోనే మేకర్స్ ఈ టైటిల్ తో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.పిరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.