టాక్సీవాలా రికార్డ్: ఒక్క రోజులో బ్రేక్ ఈవెన్

Sunday,November 18,2018 - 01:01 by Z_CLU

టాలీవుడ్ లో ఇప్పటివరకు ఏ హీరోకు సాధ్యం కాని రికార్డును విజయ్ దేవరకొండ సాధించి చూపించాడు. సాధారణంగా ఫస్ట్ వీకెండ్ నాటికి 50శాతం రికవరీ అవుతుంది. హిట్ టాక్ వస్తే వెంటనే బ్రేక్-ఈవెన్ అవుతుంది. ఆ తర్వాత లాభాలు వస్తాయి. కానీ టాక్సీవాలా విషయంలో ఈ రూల్స్ అన్నీ మారిపోయాయి.

అవును.. మొదటి రోజుకే బ్రేక్-ఈవెన్ సాదించింది ఈ సినిమా. అంటే.. ఇవాళ్టి నుంచి ఈ సినిమాకు వచ్చే ప్రతి పైసా లాభం కిందే లెక్క. మొదటి రోజు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల 50 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. ఈ ఎమౌంట్ తో టాక్సీవాలా సినిమా బ్రేక్-ఈవెన్ సాధించినట్టు మేకర్స్ ప్రకటించారు. ఇలా సింగిల్ డేలో బ్రేక్ ఈవెన్ అయిన సినిమా ఇప్పటివరకు రాలేదు.

ఎన్నో అడ్డంకులు దాటి థియేటర్లలోకి వచ్చింది టాక్సీవాలా సినిమా. విడుదలకు ముందే సినిమాను పైరసీ చేశారు. చాలామంది చూసి నెగెటివ్ రివ్యూస్ కూడా ఇచ్చారు. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత అసలు టాక్ బయటకొచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు సూపర్ హిట్ అంటున్నారు.