షూటింగ్ అప్ డేట్స్

Thursday,January 24,2019 - 04:02 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న కొన్ని సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం…

సైరా నరసింహ రెడ్డి

మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘సైరా నరసింహ రెడ్డి’ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ ఓ జాతర సెట్ వేసి చిరు, మిగతా నటీ నటులపై కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది రెండో భాగంలో విడుదల కానుంది.


మహర్షి

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మహర్షి’ పొలాచ్చి లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం మహేష్ పై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు యూనిట్. త్వరలోనే పొలాచ్చి షెడ్యూల్ ఫినిష్ చేసుకొని హైదరాబాద్ లో చివరి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. అశ్వనిదత్ , దిల్ రాజు , పి.వి.పి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుంది.


ఇస్మార్ట్ శంకర్

పూరి జగన్నాథ్ – రామ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’ షూటింగ్ ఈరోజే మొదలైంది. నిన్న గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. హైదరాబాద్ లోని కొన్ని మెయిన్ లోకేషన్స్ లో ఫస్ట్ షెడ్యూల్ షూట్ చేయనున్నారు. పూరి -ఛార్మీ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.

గోపి చంద్ సినిమా

తిరు డైరెక్షన్ లో గోపీచంద్ నటిస్తున్న సినిమా ఇండియా, పాకిస్థాన్ బోర్డర్ లో షూటింగ్ జరుపుకుంటోంది.హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ భారీ ఫైట్ సీక్వెన్స్ తో మొదలైంది. యాక్షన్ డైరెక్టర్ సెల్వన్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరిస్తున్నారు.. యాభై రోజు ల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో రాజస్థాన్, న్యూ ఢిల్లీ వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరపనున్నారు.. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తుండగా, వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై ప్రొడక్షన్ నెంబర్ 18 గా అనిల్ సుంకర ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.. వేసవి కానుకగా మే లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది


కార్తికేయ సినిమా

‘ఆర్.ఎక్స్.100’ ఫేం కార్తికేయ హీరోగా, అర్జున్ జంధ్యాల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం ఒంగోలులో జరుగుతోంది. ఇటివలే ప్రారంభమైన షూటింగ్ ఫిబ్రవరి 10 వరకూ జరగనుంది. కార్తికే సరసన మలయాళి బ్యూటీ అనఘ హీరోయిన్ గా నటిస్తోంది. జ్ఞాపికా ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా ఈ ఏడాది రెండో భాగంలో విడుదల కానుంది.

కళ్యాణ్ దేవ్ మూవీ

మెగా స్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ రెండో సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుపుకుంటోంది. ప్రస్తుతం బీరంగూడలో కళ్యాణ్ దేవ్ మిగతా నటీ నటులపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు యూనిట్. రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న రియా చక్రవర్తి హీరోయిన్ గా నటిస్తోంది. సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.