ఈ వీకెండ్ జీ తెలుగు సినీ అవార్డ్స్ 2018 సందడి

Thursday,January 24,2019 - 06:19 by Z_CLU

రీసెంట్ గా హైదరాబాద్ లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఘనంగా జరిగింది జీ తెలుగు సినీ అవార్డ్స్ ఈవెంట్. టాలీవుడ్ టాప్ స్టార్స్ చేసిన ఇంట్రెస్టింగ్ పర్ఫామెన్స్ తో, అవార్డ్స్ అందుకున్న స్టార్స్ స్పీచులతో కన్నుల పండగగా జరిగింది ఈ కార్యక్రమం. కొత్త సంవత్సరంలో కలర్ ఫుల్ గా జరిగిన ఈ కారక్రమాన్ని సరికొత్తగా ఈ శని, ఆదివారాల్లో టెలీకాస్ట్ చేయనుంది జీ తెలుగు.

2018 లో అద్బుతమైన సినిమాలు రిలీజ్ అయ్యాయి. జస్ట్ డెబ్యూ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన స్టార్స్ దగ్గరి నుండి, ప్రయోగాత్మక సినిమాలు చేసి ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సెట్ చేసిన టాప్ స్టార్స్ వరకు ప్రతి ఒకరిని గుర్తించి, అవార్డ్స్ అందించింది జీ తెలుగు. ప్రతి స్టార్ కలలు కనే ఈ ప్రెస్టీజియస్ అవార్డును అందుకున్న క్షణం, మన ఫేవరేట్ స్టార్స్ పొందిన అనుభూతి కళ్ళారా చూడాల్సిందే.

ఇదే వేదికపై స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళి అర్పించింది జీ తెలుగు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ గారు ఇచ్చిన ఇమోషనల్ స్పీచ్ ఈ ఈవెంట్ కే హైలెట్ గా నిలిచింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు కూడా అటెండ్ అయిన ఈ ఈవెంట్ లో మరెన్నో వినోదాత్మక కార్యక్రమాలు జోడించింది జీ తెలుగు.

రెగ్యులర్ గా సరికొత్త కార్యక్రమాలతో మీ ఇంటిల్లిపాదిని అలరిస్తున్న జీ తెలుగు, ఈ వీకెండ్ మరింత జోష్ నింపనుంది. ఈ శని ఆదివారాల్లో, జనవరి 26, 27 తేదీల్లో సాయంత్రం 6 గంటల నుండి మీ ఫేవరేట్ జీ తెలుగు తో పాటు జీ తెలుగు HD ఛానల్స్ లో చూసి ఆనందించండి.