ఏ హీరోయిన్ చేతిలో ఎన్ని సినిమాలు?

Saturday,June 16,2018 - 10:03 by Z_CLU

హీరోలతో పాటే హీరోయిన్స్ కూడా వరసగా ఒకదాని తరవాత ఒకటి ఏ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ అనిపించుకుంటున్న కొందరు ముద్దుగుమ్మలు ఏయే సినిమాలు చేస్తున్నారో చూద్దాం.

కాజల్ అగర్వాల్

50 సినిమాల తరవాత కూడా ఇంకా అదే రేంజ్ లో క్రేజ్ మెయిన్ టైన్ చేస్తుంది ముద్దుగుమ్మ కాజల్. ఓ వైపు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు సంతకం చేసిన కాజల్ అగర్వాల్, రవితేజ రీమేక్ లోను హీరోయిన్ గా నటించనుంది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ రీమేక్ రాబోతోంది.

తమన్నా

కళ్యాణ్ రామ్ లవ్ ఎంటర్ టైనర్ ‘నా నువ్వే’ లో మెస్మరైజ్ చేసిన మిల్కీబ్యూటీ తమన్నా, ఈ సినిమా సెట్స్ పై ఉండగానే అటు క్వీన్ రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మి’ తో పాటు మెగాస్టార్ సైరా సినిమాలోను నటిస్తుంది.

పూజా హెగ్డే

బెల్లంకొండ శ్రీనివాస్ ‘సాక్ష్యం’ లో నటించిన పూజా హెగ్డే అటు మహేష్ బాబు సినిమాతో పాటు, NTR అరవింద సమేత సినిమాలో నటించే లక్కీ చాన్స్ కొట్టేసింది.

 

సాయిపల్లవి

ఫిదా సినిమాతో అందరూ ఫిదా అయ్యేలా చేసిన సాయి పల్లవి వరస హిట్లతో బిజీబిజీగా ఉంది. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘పడి పడి లేచే మనసు’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో బెంగాళీ అమ్మాయిలా కనిపించనుంది సాయిపల్లవి.

అనుపమ పరమేశ్వరన్ : ఓ వైపు రామ్ సరసన ‘హలో గురూ ప్రేమ కోసమే’ లో నటిస్తూనే, తేజ్ I love u లోను నటిస్తుంది అనుపమ. ఈ రెండు సినిమాలూ లవ్ ఎంటర్ టైనర్సే  కావడం విశేషం.

సమంత : ప్రస్తుతం ‘యూటర్న్’ సినిమాలో నటిస్తున్న సమంతా త్వరలోనే శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో నాగచైతన్య తో జోడీ కట్టనుంది. పెళ్ళి తరవాత ఫస్ట్ టైమ్ ఇలా తెరపైకి వస్తున్నారు ఈ రియల్ కపుల్.

 

రాశిఖన్నా : నితిన్ ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలో నటిస్తుంది రాశిఖన్నా. తొలిప్రేమ సక్సెస్ తో స్పీడ్  మీదున్న రాశి, ఏ మాత్రం గ్యాప్ దొరికినా నెక్స్ట్ సినిమాల స్క్రిప్ట్స్ వినే పనిలో బిజీగా ఉంటుంది.

 

మెహరీన్ : వరసగా 3 సినిమాలు చేస్తుంది మెహరీన్ కౌర్. రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘పంతం’ సినిమాలో నటించిన మెహరీన్, విజయ దేవరకొండ ‘నోటా’ సినిమాతో పాటు, రేపో మాపో సెట్స్ పైకి రానున్న వెంకీ, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ ఫన్ & ఫ్రస్ట్రేషన్ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించనుంది.

రకుల్ ప్రీత్ సింగ్ : బాబీ డైరెక్షన్ లో వెంకటేష్, నాగచైతన్యల కాంబినేషన్ లో తెరకెక్కనున్న మల్టీస్టారర్ లో నాగ చైతన్య సరసన నటించనుంది రకుల్ ప్రీత్ సింగ్.

కైరా అద్వానీ : టాలీవుడ్ లో ఫస్ట్ మూవీ ‘భరత్ అనే నేను’ సినిమాతో ఎట్రాక్ట్ చేసిన కైరా, ఆ సినిమా సెట్స్ పై ఉండగానే రామ్ చరణ్ సరసన నటించే లక్కీ చాన్స్ కొట్టేసింది.

రష్మిక మండన్న : నాగశౌర్య ‘ఛలో’ సినిమాతో యూత్ కి దగ్గరైన రష్మిక ప్రస్తుతం నాని-నాగార్జున మల్టీస్టారర్ లో నాని సరసన నటిస్తుంది. దీంతో పాటు విజయ్ దేవరకొండ సరసన ఏకంగా 2 సినిమాల్లోనూ చాన్స్ కొట్టేసింది. భరత్ కమ్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న డియర్ కామ్రేడ్ సినిమాతో పాటు, పరశురామ్ బుజ్జి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలోను నటిస్తుంది రష్మిక.